Fengal Cyclone : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యాసంస్థలకు సెలవు

by M.Rajitha |
Fengal Cyclone : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యాసంస్థలకు సెలవు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాను(Cyclone)గా మారి, ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని కరైకాల్ - మహాబలిపురం వద్ద తీరం దాటింది. ఫెంగల్(Fengal) గా నామకరణం చేసిన ఈ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు(Tamilanadu) భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఫెంగల్ ఎఫెక్ట్ వలన ఏపీ(AP)లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా చిత్తూరు(Chitthur) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం సెలవు ప్రకటించారు. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలకు కూడా సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story