Ycp Mp Margani: వాగితే బాగోదు... ఎంపీ రఘురామకు స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2023-03-20 15:07:31.0  )
Ycp Mp Margani: వాగితే బాగోదు... ఎంపీ రఘురామకు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్గు పెట్టుకుని, పెగ్గు పట్టుకుని మందు తాగిన కోతిలా రఘురామ చిందులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. చిందులు వేస్తే వేసుకోవాలని, కానీ మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు వాగితే బాగుండదని..నోరు అదుపులో పెట్టుకోవాలని భరత్ హెచ్చరించారు.


రాజమండ్రిలో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఎంపీ భరత్ తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీ రఘురామ బఫూన్, అరిటాకు, శిఖండి అంటూ వ్యాఖ్యానించారు. ‘నువ్వు దేహీ అని అడుక్కుంటే సీఎం జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు. తీరా గెలిచాక శిఖండి చేష్టలు చేస్తున్నావు. నువ్వు రాజమండ్రిలో టీడీపీ నుంచో, జనసేన నుంచో పోటీ చేస్తావని అంటున్నారు. చెయ్యి.. నువ్వో నేనో చూసుకుందాం. లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచి చూపిస్తా. నరసాపురంలో అడుగు పెట్టే ధైర్యం లేదు. రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తావా?. పుట్టుకతోనే శ్రీమంతుడినైన నాపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఎంపీ రఘురామలా నేను బ్యాంకులకు సొమ్ము ఎగ్గొట్టలేదు.’ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ విమర్శించారు.

Read more:

YS Bhaskar Reddy: ఆయుధం కొన్నది ఆయనే.. బెయిల్ ఇవ్వొద్దు

Advertisement

Next Story