Woman Murder: తూ.గో. జిల్లాలో దారుణం.. మహిళపై సామూహిక హత్యాచారం

by Rani Yarlagadda |   ( Updated:2024-11-01 04:54:17.0  )
Woman Murder: తూ.గో. జిల్లాలో దారుణం.. మహిళపై సామూహిక హత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అక్టోబర్ 15న మహిళ మిస్సవ్వగా.. 17న ఆమె మృతదేహం లభ్యమైంది. తన భార్య మరణం అనుమానాస్పదంగా ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించడంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చినట్లు డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. వారిని కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.

Advertisement

Next Story