- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌కు భారీ షాక్.. పక్క చూపులు చూస్తోన్న ముగ్గురు సిట్టింగులు..!
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా వైసీపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీ ఇంఛార్జుల మార్పుతో సీఎం జగన్‌పై ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని సీఎం జగన్ తేగేసి చెప్పడంతో ఈ అసంతృప్తి మరింతగా చెలరేగింది. దీంతో గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారట. పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలు మూడు రోజులుగా నియోజకవర్గాల్లో కనిపించడంలేదట. పిఠాపురం ఎమ్మెల్యే అయితే పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారట. జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక జగ్గంపే ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారట. ఎలాంటి షరతులు విధించినా సరే సైకిలెక్కేందుకు ఆయన సిద్ధమవుతున్నారట. వచ్చే 5న ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం జగ్గంపేటలో జరుగుతోంది. ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైతం వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారట. రాజకీయ భవిష్యత్ బలంగా ఉండే పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నారట. వీరితో పాటు పలువురు నేతలు, మండల, కింది స్థాయి కార్యకర్తలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం, జనసేనల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. కొందరు సిట్టింగులకు టికెట్లు ఇవ్వకపోవడంపై ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఆవేదన చెందుతున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.