- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిర్మాణ దశలోనే శిథిలావస్థకు..! ఐదేళ్లుగా నిర్మాణం పూర్తికాని సచివాలయం
దిశ, ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా ఎర్రగొడపాలెం మండలంలోని గుర్రపు శాల పంచాయతీలో రూ.43.60 లక్షలతో ఐదు సంవత్సరాల క్రితం సచివాలయం నిర్మాణం మొదలుపెట్టారు. నేటికీ పూర్తికాకుండా అసంపూర్తిగా మిగిలిపోయింది. సచివాలయం పూర్తికాకుండానే కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ బిల్లులను గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ డీఈగా పనిచేసిన సుబ్బారెడ్డి చెల్లించేశారు. ఆ తరువాత కాంట్రాక్టర్ పూర్తి చేయకపోవడంతో, ప్రస్తుతం పాడుబడిన స్థితిలో దర్శనమిస్తుంది.
అప్పుడే పగుళ్లు..
నాణ్యతలేని స్టీల్, వాగు ఇసుక, తక్కువ రకం సిమెంటు.. సచివాలయ నిర్మాణంలో వాడినట్లు తెలుస్తుంది. అప్పుడే అక్కడక్కడ గోడలకు పగుళ్లు దర్శనమిస్తున్నాయి. నిర్మాణం పూర్తికాకుండానే అధికారులు పూర్తి బిల్లులు చెల్లించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ వంటి భవనాలు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కానీ, గుర్రపు శాల సచివాలయం మాత్రం నిర్మాణ దశలో ఉండటంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేనస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిగా విచారణ జరిపి వాస్తవాలను తెలియజేయాలని కోరుతున్నారు.
బిల్లుల చెల్లించాం: పంచాయతీ రాజ్ డీఈ
గుర్రపు శాల సచివాలయం పూర్తి చేయడానికి రూ.38లక్షలు చెల్లించినట్లు అప్పటి పంచాయతీ రాజ్ శాఖ డీఈ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆ నిధులు చాలవని కాంట్రాక్టర్ అనడంతో మరో రూ.3.60 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. అయినా, ఆ కాంట్రాక్టర్ పని పూర్తి చేయలేదని అన్నారు. దీంతో మరో కాంట్రాక్టర్‌కు మిగిలిన పనులు పూర్తి చేయడానికి అప్పగించామని అన్నారు.