ఏపీలో వరద బీభత్సం..ముంపు ప్రాంతాల్లో డీజీపీ పర్యటన

by Jakkula Mamatha |   ( Updated:2024-09-03 15:23:19.0  )
ఏపీలో వరద బీభత్సం..ముంపు ప్రాంతాల్లో డీజీపీ పర్యటన
X

దిశ,వెబ్‌డెస్క్:గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను అధికారులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) ముంపు ప్రాంతాల్లో డీజీపీ పర్యటిస్తున్నారు. డీజీపీ ద్వారాక తిరుమల రావు సింగ్‌నగర్‌లో సహాయక చర్యలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆహారం పంపిణీ దగ్గర మూకుమ్మడిగా రావడంతో..కొంత ఇబ్బంది కలిగిందని తెలిపారు.వరదలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు మృతి చెందారని తెలిపారు. సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి ఇంటికి ఆహారం పంపిణీ చేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed