Pawan Kalyan:సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తిన డిప్యూటీ సీఎం పవన్..కారణం ఇదే!

by Jakkula Mamatha |
Pawan Kalyan:సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తిన డిప్యూటీ సీఎం పవన్..కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains)కు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలను వరద(Floods) నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) వరద బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు గత నాలుగైదు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నిద్రాహారాలు మాని శ్రమించారు.

ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామంగా పని చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) ప్రశంసల్లో ముంచెత్తారు. పనితనం ఆదర్శమని ఆకాశానికెత్తారు. సీఎం చంద్రబాబు నాయకత్వం(Leadership), పాలనలో అవిశ్రాంత కృషి నిజంగా స్ఫూర్తిదాయకమని, ప్రశంసనీయమని పవన్ కొనియాడారు. అధికార సంక్షోభం, వ్యవస్థలను నిర్వీర్యం, వనరుల దోపిడీ(Exploitation of resources) వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం(Natural disaster), వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయమని సీఎం చంద్రబాబును పవన్ కల్యాణ్ కొనియాడారు.

Advertisement

Next Story