బుడమేరు వాగు 90 శాతం ఆక్రమణలకు గురైంది.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

by Mahesh |   ( Updated:2024-09-04 14:48:41.0  )
బుడమేరు వాగు 90 శాతం ఆక్రమణలకు గురైంది.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో బుడమేరు వాగు ఉప్పొంగడంతో భారీ వరదలు వచ్చాయి. దీంతో పదుల సంఖ్యలో కాలనీలు, వేల సంఖ్యలో ఇళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. నేటికి వరదలు తగ్గకపోవడం గమనార్హం. కాగా ఈ వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. జిల్లా కలెక్టర్లతో వరదలపై సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదని.. తాము అనేక సవాళ్ల మధ్య అధికారం చేపట్టామని.. బుడమేరు వాగు 90 శాతం ఆక్రమణలకు గురవ్వడం చేతనే వరదలు వచ్చాయని అన్నారు. వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శించడం తగదని.. తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపించడం లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. నేను వెళితే సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే వెళ్లలేదు. వైసీపీ నేతలు సహాయక చర్యల్లో పాల్గొని మాట్లాడితే బాగుంటుంది. ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రశంసించాల్సింది పోయి విమర్శిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.


Also Read: Pawan Kalyan: ‘హైడ్రా’పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు.. సీఎం రేవంత్ మంచి పని చేశారని కితాబు


Click Here :👉 Breaking: తెలంగాణకు భారీ విరాళం ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

Advertisement

Next Story

Most Viewed