- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూలే ఆశయ సాధనకు కృషి.. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
దిశ, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆదర్శప్రాయుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్. బి.అంజాద్ బాషా అన్నారు. మంగళవారం పాత బస్టాండులోని పూలే సర్కిల్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు జిల్లా బీసీ సంక్షేమ శాఖ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. బి. అంజాద్ బాషా చేతుల మీదుగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగానే కడప నగరంలో కూడా అధికారులు, నేతలు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేకి ఘన నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు.
మహాత్మ జ్యోతి రావు పూలే కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి ప్రతి మహిళకు ఉన్నతమైన చదువులు చదవాలనే లక్ష్యంతో ఆ మహోన్నత వ్యక్తి అనేక పోరాటాలు చేయడం జరిగిందని చెప్పారు. ఆయన పోరాటాల ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు వారి వారి హక్కులు రావడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ దేశంలో కుల వివక్షతను రూపుమాపడం జరిగిందని, మహిళలకు విద్యాపరంగా అనేక అవకాశాలు కూడా రావడం జరిగిందని అన్నారు. ఆనాడు దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మహాత్మ జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకొని ఆయన ఐదేళ్ల పరిపాలన చేయడం జరిగిందని, బీసీలకు పెద్దపీట వేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా, గత ప్రభుత్వాలలో బీసీలకు కులవృత్తుల కే పరిమితం చేయడం జరిగిందని, దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి బీసీ వర్గాల్లో కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆలోచనతో అనేక అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు వెనుకబడిన తరగతుల కులాల వారు కాదని బి.సి.లు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి వెన్ను తట్టి మన ముఖ్యమంత్రి చేయి పట్టి ముందుకు నడిపిస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా బీసీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా బీసీలకు న్యాయం జరగని పరిస్థితి అని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో ఎన్నడు లేని విధంగా బిసి కులాలకు పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనను కొనసాగించడం జరిగిందన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో చూస్తే 11 మంది బి.సి.లకు మంత్రివర్గంలో అవకాశం కల్పించిన ప్రభుత్వం, నాయకుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
అంతేకాకుండా వెనుకబడిన తరగతుల 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ కు ఒక చైర్మన్ ను ఏర్పాటు చేస్తూ అదేవిధంగా 700 పైచిలుకు రాష్ట్రస్థాయి డైరెక్టర్లను కూడా నియమించడం జరిగిందని ఆ ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్.బి. అంజాద్ భాష తోపాటు నగర డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైకాపా సీనియర్ నాయకులు అఫ్జల్ ఖాన్, వైకాపా నాయకులు సుభాన్ భాష, నారపరెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ, జయచంద్ర రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి వి బ్రహ్మయ్య, మార్కెట్ యార్డ్ బంగారు నాగయ్య యాదవ్, స్థానిక కార్పొరేటర్ షేక్ మొహమ్మద్ షఫీ, ఇతర కార్పొరేటర్లు బసవ రాజు ఇతర కుల సంఘాల నాయకులు సుంకేసుల ఖాదర్బాషా, అవ్వారు మల్లికార్జున, జెవి రమణ, సంగటి మనోహర్, పివి రమణ, ఇతర నాయకులు నీలి శ్రీనివాసులు, నజీర్ అహ్మద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read..
టీటీడీ ఆసుపత్రుల్లో సేవలు అభినందనీయం.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి