మరోసారి కరోనా విజృంభణ... ప్రభుత్వం కీలక నిర్ణయం

by srinivas |
మరోసారి కరోనా విజృంభణ... ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇదే సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏపీలోనూ కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మన్సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ పెరుగుతున్న వైరస్‌ ముప్పును దృష్టిలో పెట్టుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఉన్న సన్నద్ధతను అంచనా వేసేందుకు ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాక్ డ్రిల్‌ను ప్రకటించింది. ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ సరఫరా సహా ఇతర అత్యవసర ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే వీటిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో వచ్చిన బీఎఫ్‌.7 ఉత్పరివర్తనమే ఇప్పటి వరకు చివరిదని తెలిపారు. తాజాగా ఎక్స్‌బీబీ1.16 సబ్‌ వేరియంట్‌ ద్వారా కేసులు వ్యాపిస్తున్నాయని వివరించారు. అయితే, సబ్‌వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కాదని, అందువల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని మాండవీయ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed