- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ వేధించింది... షర్మిల మద్దతుపై సజ్జల
దిశ , డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామన్న వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారడ్డి స్పందించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది ఆమె ఇష్టం అని చెప్పుకొచ్చారు. తాడేపల్లిలో శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ అధినేతగా వైఎస్ షర్మిల ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అని అన్నారు. ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టం అని అయితే తాము మాత్రం ఏపీకి చెందిన విషయాలపైనే ఫోకస్ పెడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వేధించిందని ఆరోపించారు. ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టారో ఆ పార్టీతో షర్మిల కలిశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌పై అనేక అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. తమకు ఏపీ విషయాలే ముఖ్యమని, తెలంగాణ ఎన్నికలతో తమకు సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మరోవైపు బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురంధేశ్వరి బీజేపీకి ప్రాతినిథ్యం వహించకుండా కేవలం చంద్రబాబు ఫ్యామిలీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి ఇసుకపై చేసిన ఆరోపణలను ఖండించారు. ‘ఇసుకలో ఉచితంగా మార్కెట్‌లో లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్ మీద మాత్రమే దొరికిందా చెప్పాలి. ఉచితంగా అంటే క్రేన్ లు , బోట్లతో ఎవరు తోడారు. ఎన్‌జీటీ ఎందుకు ఫైన్ విధించింది.మద్యంలో కూడా ప్రివిలేజ్ కేస్ వేసి తర్వాత దాన్ని తీసేస్తారు. ఈ వ్యవహారంలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేస్ పెట్టారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.