ప్రైవేట్ స్కూల్స్‌కు సీఎం జగన్ గుడ్ న్యూస్... ఆ అవకాశం 8ఏళ్లకు పొడిగింపు

by Seetharam |
ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్‌కు గతంలో కల్పించిన మూడేళ్ల గుర్తింపును ఎనిమిదేళ్లకు పొడిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే మూడేళ్లు గుర్తింపు పొందిన స్కూల్స్‌కు ఎనిమిదేళ్లు పొడిగించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే కొత్తగా తీసుకునే వారికి మాత్రం ఎనిమిదేళ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పనుంది. దీంతోపాటు ప్రైవేట్ స్కూళ్లలో అదనపు సెక్షన్ల ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం అనుమతుల ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆఫ్ లైన్‌లో ప్రతిపాదనలు పంపేలా ప్రైవేట్ స్కూళ్లకు అవకాశం కల్పించారు. 2024-25 నుంచి కొత్త పాఠశాలల ఏర్పాటు, ఉన్నతీకరణ కోసం డిసెంబర్ 31 వరకు ఎలాంటి జరిమానాలు లేకుండా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే 2024లో టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం అదనపు సెక్షన్లకు ఆన్‌లైన్‌లో అనుమతులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చే క్రమంలో భాగంగా ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల కొరతతో ఇబ్బందులు పడ్డాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి కాస్త బూస్ట్ ఇచ్చినట్లైంది.

Advertisement

Next Story

Most Viewed