Breaking: వైసీపీ ‘సిద్ధం’ సభ వాయిదా

by srinivas |   ( Updated:2024-01-26 13:40:33.0  )
Breaking: వైసీపీ ‘సిద్ధం’ సభ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: వైనాట్ 175 అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇందులో భాగంగా పలుచోట్ల ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహించనున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన పథకాలు.. చేసిన అభివృద్ధిని ఈ సభల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ఇప్పటికే ఈ సభలకు సంబంధించిన తేదీల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అయితే పలు కారణాలతో ఏలూరు వైసీపీ ‘సిద్ధం’సభ వాయిదా పడింది. నిజానికి ఈ సభ ఏలూరులో జనవరి 30న జరగాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. జనవరి 30కు బదులు ఫిబ్రవరి 1న సభ నిర్వహిస్తామని చెప్పారు.

కాగా ఎన్నికలపై సీఎం జగన్ దూకుడు పెంచారు. భీమిలీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ నిర్వహించే సభ నుంచి ప్రచార శంఖారావం పూరించనున్నారు. ఈ ఐదేళ్లలో తాను ఏం చేశారనేది ప్రజలకు తెలపనున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. శనివారం చేపట్టబోయే ‘సిద్ధం’ వైసీపీ సభకు సర్వం సిద్ధం చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ఏలూరులో జనవరి 30న జరగాల్సిన సభ వాయిదా పడింది.

Advertisement

Next Story

Most Viewed