CM Chandrababu:కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

by Jakkula Mamatha |   ( Updated:2024-08-13 13:29:06.0  )
CM Chandrababu:కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు శాఖలపై చంద్రబాబు దృష్టిసారించారు. గత వైసీపీ పాలనలో ఆయా శాఖలలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలకు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేశారు. అలాగే అనేక శాఖలలో పరిస్థితి ఎలా ఉందనే దానిపై సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో నేడు(మంగళవారం) పలు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు విద్యా శాఖ, స్కిల్ డెవలెప్మెంట్‌పై సమీక్ష నిర్వహిస్తారు. అలాగే టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ పై రివ్యూ చేపట్టనున్నారు. జగనన్న కిట్ల పేరుతో గత ప్రభుత్వ అక్రమాలు, సీబీఎస్ఈ స్కూళ్ల పనితీరు, విద్యా విధానంలో తీసుకు రావాల్సిన మార్పులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. స్కిల్ సెన్సస్ అమలుపై చర్చించనున్నారు. స్కిల్ సెన్సస్ ద్వారా వచ్చిన డేటాను సమగ్రంగా విశ్లేషించి.. ఉపాధి కల్పించే అంశంపై రూపొందించాల్సిన ప్రణాళికలపై చంద్రబాబు చర్చలు జరపనున్నారు.

Read More..

AP News:సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన షెడ్యూల్ ఖరారు

Advertisement

Next Story

Most Viewed