- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Chandrababu:రేపు శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
దిశ, శ్రీశైలం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా శ్రీశైలం లో పర్యటించనున్న సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను స్వయంగా పర్యటించి తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి శ్రీశైలం చేరుకున్నప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1100 మంది పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను 11 సెక్టర్లుగా విభజించడం జరిగింది.
ప్రతి సెక్టార్ కు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని ఆపై డి.ఎస్.పి స్థాయి అధికారులు నియమించడం జరిగింది. సుండిపెంట హెలిపాడ్ నుంచి టెంపుల్ వరకు మరియు హెలిప్యాడ్ నుంచి పవర్ ప్రాజెక్ట్ డాం వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సుమారు 180 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఒక డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించడం జరిగింది. B.D టీంకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి DFMD లు, HFMD లు మరియు ఇతర పూర్తి పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.హెలిప్యాడ్ నుండి శ్రీశైలం ముఖద్వారం, హఠకేశ్వరం, సాక్షి గణపతి, నంది సర్కిల్, VVIP అతిథి గృహ పరిసర ప్రాంతాలు, కొత్తపేట సుండిపెంట స్విచ్ యాడ్ లింగాల గట్టు మరియు ఆనకట్ట మొదలైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.గ్రేహౌండ్స్ మరియు స్పెషల్ పార్టీ బలగాలతో శ్రీశైలం అడవులన్నింటిని జల్లెడ పట్టడం జరిగింది.