- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Population decline:జనాభా తగ్గుదలపై సీఎం చంద్రబాబు ఆందోళన
దిశ,వెబ్‌డెస్క్: జనాభా తగ్గిపోవడం ప్రమాదకరమని గుడివాడ సభలో సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు (గురువారం) సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అంతేకాదు భోజనం కూడా చేశారు. సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి ఇద్దరూ కలిసి భోజనం వడ్డించారు. ఆ తర్వాత భోజనం ఎలా ఉందంటూ పలువురిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుడివాడలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..జనాభా తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఒకే బిడ్డను కనాలనుకుంటున్నారు. కొంతమంది అసలు బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం అని అన్నారు. ముసలివాళ్ళు పెరిగి, యువత తగ్గిపోతోంది. దీని వల్ల సంపాదన కూడా తగ్గపోతుందని తెలిపారు. ఎంతమంది పిల్లలుంటే అంత సంపాదించే శక్తి మీకు వస్తుంది. ఒకప్పుడు జనాభా తగ్గించుకోమని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు జనాభా పెరగాలి అని పిలుపునిచ్చారు.