అనకాపల్లి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-19 14:24:14.0  )
అనకాపల్లి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: రక్షా బంధన్ వేళ అనకాపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజన్ కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. కాగా, కైలాసపట్నంలో ఉన్న ఓ అనాథ పాఠశాలలోని విద్యార్థులు రెండు రోజుల క్రితం సమోసాలు తిన్నారు. అనంతరం.. అస్వసత్థకు గురయ్యారు. 24 మంది విద్యార్థుల్లో ఏడుగురిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి, మిగతా 17 మందిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ముగ్గురు విద్యార్థులు కన్నుమూశారు.

Read more...

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ : మంత్రి నిమ్మల రామానాయుడు

Advertisement

Next Story

Most Viewed