బిగ్ బ్రేకింగ్: చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. ACB కోర్టులో సీఐడీ మరో పీటీ వారెంట్

by Satheesh |   ( Updated:2023-09-19 12:38:46.0  )
బిగ్ బ్రేకింగ్: చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. ACB కోర్టులో సీఐడీ మరో పీటీ వారెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ తాజాగా పీటీ వారెంట్ వేసింది. ఈ పిటిషన్‌లో మాజీ సీఎం చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. ఏపీ ఫైబర్ నెట్ స్కీమ్‌లో అక్రమాలు జరిగాయని సీఐడీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.

కాగా, చంద్రబాబు హాయంలో ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని.. రూ.121 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని.. 2019లో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. టెర్రా సాఫ్ట్‌కు అక్రమంగా టెండర్లు ఇచ్చారని.. సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ కేసుపై తాజాగా సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ వేసింది. ఈ పిటిషన్‌లో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంది. కాగా, ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబుకు మరో పీటీ వారెంట్ వేసి సీఐడీ బిగ్ షాకిచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఓ పక్కా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే.. మరో పక్కా సీఐడీ ఫైబర్ నెట్ స్కామ్‌లో పీటీ వారెంట్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed