Chittoor: చిరుత మృతి కేసులో పురోగతి

by srinivas |
Chittoor: చిరుత మృతి కేసులో పురోగతి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో చిరుత మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అటవీ శాఖ అధికారులు పురోగతి సాధించారు. చిరుత‌పులి గోర్లు, కాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. బంగారుపాళ్యం మండలం వెతలచేనులోని ఓ ఇంటిలో డీఎఫ్‌వో భ‌ర‌ణి తనిఖీలు నిర్వహించారు. దీంతో చిరుతను చంపిన ఐదు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మీడియాకు వివరాలు తెలిపారు.

వెతలచేను అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన వేటగాళ్లు వన్య ప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చారని డీఎఫ్‌వో భ‌ర‌ణి తెలిపారు. రాత్రి సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో చిరుత మృతి చెందనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. నిందితులను విచారిస్తున్నామని తెలిపారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed