Tiruchanur: పద్మావతి అమ్మవారికి మొక్కులు చెల్లించిన మంత్రి వేణు

by srinivas |   ( Updated:2023-11-01 15:22:04.0  )
Tiruchanur: పద్మావతి అమ్మవారికి మొక్కులు చెల్లించిన మంత్రి వేణు
X

దిశ, తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఏఈవో రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ధ్వజ స్తంభానికి మొక్కి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా ఆలయ ఏఈవో తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. అమ్మవారి దర్శనానికి ముందు మంత్రికి రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, సహాయ వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణయ్య సాదర స్వాగతం పలికారు.

Advertisement

Next Story