శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం

by Jakkula Mamatha |
శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం
X

దిశ, తిరుమల:శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రితో పాటు టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తో పాటు శ్రీవారిని దర్శించుకున్న పాలకమండలి మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.తమ పార్టీ తరపున దేవుని దర్శనం కోసం వచ్చే ప్రముఖులకు పార్టీ లెటర్ తో బ్రేక్ దర్శనానికి అనుమతి కోరుతూ టీటీడీ ఈవో కి లెటర్ పెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు.ఇది పార్టీలకతీతంగా జరుగుతున్న విషయం అన్నారు. అయితే గత కొంతకాలంగా ప్రోటోకాల్ దర్శనం కోసం తాను లెటర్ పెడితే అందులో నుంచి నా పేరు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్ మాజీ సీఎం దర్శనం విషయంలో ఉద్దేశపూర్వకంగా నా పేరు తొలగించడం బాధ కలిగించింది అన్నారు. మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా భగవంతుడు నాకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చారని తెలిపారు. అయితే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా నా పేరు ఉంటే దర్శనానికి అనుమతి ఇవ్వద్దని టీటీడీ ఈవో ఆదేశాలు జారీ చేయడం మంచిది కాదన్నారు. వ్యక్తిగత కక్షల కోసం దేవుని దగ్గరకు రానివ్వకుండా నన్ను ఆపడం మంచి పద్ధతి కాదన్నారు. ధర్మకర్తలి మండలి మాజీ సభ్యుడిగా రూ.300 లేక, బ్రేక్ దర్శన సమయంలో భగవంతుని దర్శనం నా హక్కు అన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగానే దేవున్ని దర్శించుకోవడం జరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed