Tirumala:శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు

by Jakkula Mamatha |
Tirumala:శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు
X

దిశ, తిరుమల: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ బుల్లెట్ అనే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నానని తెలిపారు. మాట్రాం సోషియల్ కమ్యూనిటీ ప్రారంభించానని, దానిద్వారా సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. అన్నిటికీ ఆ దేవుడే కారణం..ఆయన దయతోనే ఇదంతా చేయగలిగానని లారెన్స్ అన్నారు.

Advertisement

Next Story