Tirumala News:తిరుమలలో అదనపు ఈవో విస్తృత తనిఖీలు

by Jakkula Mamatha |
Tirumala News:తిరుమలలో అదనపు ఈవో విస్తృత తనిఖీలు
X

దిశ, తిరుమల: టీటీడీ అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాలను, దర్శనం క్యూ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆల్వార్ ట్యాంక్ అతిథి గృహాల వద్ద వున్న ఏస్ఎస్ డి క్యూలైన్లు, టోకెన్ తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. తరువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మరియు 2లోని కంపార్ట్‌మెంట్లు, సుపథం వద్ద చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలతోపాటు వివిధ దర్శనాలను సంబంధిత అధికారులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఎస్ఇడి క్యూ లైన్లను, ఫోటో క్యాప్చర్ తదితరాంశాలను పరిశీలించారు. అదనపు ఈవో వెంట ఎస్‌ఈ 2 జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, శ్రీమతి ఆశాజ్యోతి, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, వీజీఓలు నందకిషోర్, గిరిధర్ రావు ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story