- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cm Jagan: కొత్త పారిశ్రామిక విధానంపై కీలక ఆదేశాలు
దిశ,డైనమిక్ బ్యూరో: విశాఖపట్నంలో సుమారు 3 లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అందరికీ అనుకూలమైన ప్రాంతంలో భవనాన్ని నిర్మించాలని, అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాయం కూడా ఉండేలా నిర్మాణం చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పరిశ్రామలశాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలని సూచించారు. న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలని కోరారు. అంతర్జాతీయంగా మార్కెటింగ్ టైఅప్ చేయగలిగితే ఎంఎస్ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతామని అభిప్రాయపడ్డారు.
ఎంఎస్ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయన్న సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కాన్సెప్ట్ నుంచి కమిషనింగ్ మొదలుకుని మార్కెటింగ్ వరకు హేండ్ హోల్డింగ్‌గా ఉండాలని ఆదేశించారు. అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్‌గా ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. అలాగే స్టార్టప్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేలా నిర్ణయాలు ఉండాలని ఆదేశించారు. స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. వీటితోపాటు పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పనదిశగా దృష్టిసారించాలన్నారు. ఈ అంశాల ప్రాతిపదికగా ఇండిస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, గుల్జార్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.