- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తిరుపతిలో ఉద్రిక్తత.. చంద్రగిరి టీడీపీ ఇంచార్జి నాని ఆత్మహత్యాయత్నం..!
దిశ, వెబ్ డెస్క్: దొంగ ఓట్లు తొలగించాలంటూ తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం ఉదయం టీడీపీ చంద్రగిరి ఇంచార్జి పులివర్తి నాని ఆమరణ దీక్షకు దిగారు. దాదాపు 30 వేల దొంగ ఓట్లు వైసీపీ నేతలు నమోదు చేయించారని ఆరోపించారు. దీంతో వైసీపీ నేతలు సైతం పోటా పోటీగా ధర్నాకు దిగారు. తమ పార్టీకి చెందిన 15 వేల ఓట్లు తొలగించారని వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆర్డీవో కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అటు రెండు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా శిబిరం వద్ద పులివర్తి నాని దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల తీరుపై పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దీక్షను భగ్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. ఈ క్రమంలో ఆయన అనుచరులపైనా పెట్రోల్ పడింది. దీంతో పోలీసులు రెండు వర్గాలను ఖాళీ చేయించారు.