- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Vijayawada Flood : ఇంకా బెజవాడను వీడని వరద నీరు
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పట్టణం ఇంకా వరదలోనే మగ్గుతోంది. గత రెండు రోజుల కంటే ఈరోజు కాస్త వరద తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా వరద నుండి ఇంకా కోలుకోలేదు. వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆహార పోట్లాలు, వాటర్ బాటిల్స్ ఎప్పటికప్పుడు బాధితులకు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వరద నీటి వల్ల మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో సీఎం కాలినడకన వరదలోనే వివిధ ప్రాంతాల్లోని బాధితులను కలసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాగా సీఎంకు, అధికారులకు ఎవరికీ మధ్యాహ్న భోజన విరామ సమయం లేకుండానే ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటన అనంతరం సీఎం తాత్కాలిక సచివాలయ ఆఫీస్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.