- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: కాసేపట్లో విజయవాడకు సీఎం చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకోనున్నారు. ఏపీకి నిధుల విడుదలే లక్ష్యంగా ఆయన రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించారు. ప్రధాని మోడీతో పాటు ఆరుగురు కేంద్రమంత్రులను కలిశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. లోటు బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగించాలని కేంద్రంతో ఇప్పటికే చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్, వెనుక బడిన జిల్లాల అభివృద్ధి అభివృద్దిపైనా ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. చంద్రబాబు చేసిన విజ్ఞప్తులను అటు ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారని టీడీపీ వర్గాలు అంటున్నారు. ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగియడంతో చంద్రబాబు అక్కడి నుంచి ఏపీకి బయల్దేరారు. కాసేపట్లో గన్నవరం చేరుకోనున్నారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు. సాయంత్రం లేదా సోమవారం పార్టీ శ్రేణులతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.