ఆరోగ్యంపై ఆందోళన: ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు.. మళ్లీ పరీక్షలు

by Seetharam |   ( Updated:2023-11-06 07:38:41.0  )
ఆరోగ్యంపై ఆందోళన: ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు.. మళ్లీ పరీక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరోసారి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు చంద్రబాబుకు తెలియజేశారు. ఇటీవలే చంద్రబాబు నాయుడుకు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఒకరోజు అబ్జర్వేషన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని ఆస్పత్రికి రావాలని ఆదేశించారు. దీంతో చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్‌లోని తన నివాసం నుంచి మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు వెళ్తుండగా మార్గమధ్యలో టీడీపీ నేతలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి వారిని పలకరించారు. దీంతో టీడీపీ క్యాడర్ హర్షం వ్యక్తం చేసింది. అనంతరం చంద్రబాబు నాయుడు ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఇకపోతే సోమవారం చంద్రబాబుకు వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలతోపాటు చర్మ సంబంధ చికిత్స అందించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స జరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story