- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News: ఎవరు సీమ ద్రోహులు?
- పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ
- - జాకీ పరిశ్రమను తరిమేశారంటూ చంద్రబాబు ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: రాయలసీమ ద్రోహి అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. రాయలసీమకు సంబంధించిన పెట్టుబడులను తరిమేసిన వాళ్లు ద్రోహులా.... రాయలసీమకు నిధులు, కంపెనీలు తెచ్చినవాళ్లు ద్రోహులా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. 'పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అని ఎద్దేవా చేశారు . ''రాయలసీమలో టీడీపీ తెచ్చిన పరిశ్రమలు ఇప్పుడు ఎందుకు వెళ్లిపోయాయని ప్రశ్నించారు. (పెట్టుబడులను తరిమేసింది ఎవరు?. సీమ ద్రోహులు ఎవరు?. సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా...లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా?.'' అని చంద్రబాబు నిలదీశారు.
జగన్ రెడ్డి కాదు...రివర్స్ రెడ్డి
నర్సాపురంలో సీఎం పర్యటన పేరుతో చెట్ల నరికివేతపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశామని, కానీ సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను...అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆయన మండిపడ్డారు. మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు...చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? అని ప్రశ్నించారు. ఇదే కదా రివర్స్ పాలన అంటే అని, నువ్వు జగన్ రెడ్డి కాదని...రివర్స్ రెడ్డి అని ఇదేం ఖర్మ రాష్ట్రానికి? అని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.