- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పు చేసిన వాళ్ల బట్టలు విప్పి నడిరోడ్డుపై తిప్పుతా.. చంద్రబాబు ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మూడురోజు ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతుంది. గుడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. అంతేకాదు చంద్రబాబు పర్యటనకు వెళ్లడానికి లేదని బారీకేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామాల నుంచి గుడిపల్లి వెళ్ళే రహదారులపై సైతం ఆంక్షలు విధించారు. అయితే చంద్రబాబు గుడిపల్లిలో పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ గుడిపల్లి రోడ్డుపై బైఠాయించారు. తన నియోజకవర్గంలో పర్యటించనివ్వరా అంటూ మండిపడ్డారు.
కుప్పం ఏమైనా పాకిస్తానా అంటూ చంద్రబాబు చెలరేగిపోయారు. మరోవైపు ఎన్నికల ప్రచార రథాన్ని తనకు అప్పగించాలని పోలీసులను కోరారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రచార రథాన్ని తీసుకున్న దాఖలాలు లేవని ఇది ప్రజాస్వామ్య రాష్ట్రామా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు చోటే లేదని చంద్రబాబు మండిపడ్డారు. ప్రచార రథాన్ని ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చంద్రబాబు స్వయంగా బస్సుపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం తీరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పారబట్టారు. వైసీపీ ప్రభుత్వం చీకటి జీవోలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తుందని మూడురోజులుగా తన నియోజకవర్గంలో పర్యటించనీయకుండా అడ్డంకులు సృష్టిస్తుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అయినప్పటికీ వెనక్కి తగ్గనన్నారు. అవసరమైతే ప్రజల కోసం ప్రాణాలను సైతం ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ప్రజాహితం కోసమే నా పోరాటం
ప్రజాహితం కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు తనను అడుగడుగునా ఆంక్షల పేరుతో అడ్డుకుంటారా అని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలు రాకుండా బారికేడ్లు పెడతారా అని విరుచుకుపడ్డారు. మూడు రోజులుగా పోలీసుల అరాచకాలను చూస్తున్నానని అంతా గమనిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బానిసలుగా బతకద్దని పోలీసులకు సూచించారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. 'రాష్ట్రంలో పోలీసులు అరాచకం వెనుక సైకో సీఎం జగన్ రెడ్డి ఉన్నాడు. పోలీసులూ.. మీకు అసలు మానవత్వం ఉందా? నన్ను నా నియోజకవర్గంలో అడ్డుకోవడానికి మీకు సిగ్గనిపించలేదా పోలీసులు? నా నియోజకవర్గ ప్రజలను నేను కలిసేందుకు హక్కు లేదా? మీ ఇష్ట ప్రకారం మమ్మల్ని వేధించడానికి ప్రయత్నిస్తారా? నేను తిరిగితే ప్రజల్లో మీపై తిరుగుబాటు వస్తుంది. మీరు ఎంత ఆపితే ప్రజలు అంతగా తిరగబడతారు. మీరు శారీరకంగా మాత్రమే ఇబ్బంది పెట్టగలుగుతారు. ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చే సంకల్పం నాది. వేలమంది పోలీసులు వచ్చారు.. మేమేమైనా టెర్రరిస్టులమా? అని చంద్రబాబు నిలదీశారు. నన్ను పంపేయాలని చూస్తే మిమ్మల్నే పంపిస్తా అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. వైసీపీ నేతలు రోడ్డు షోలు, సభలు పెట్టుకోవచ్చా.? వైసీపీ వాళ్లకు ఒక రూలు.. మాకో రూలా? అని చంద్రబాబు నిలదీశారు. ప్రజాహితం కోసమే నా పోరాటం.. బానిసలుగా మారిన పోలీసులను చూస్తే నాకు జాలేస్తోంది. నాది ఉక్కు సంకల్పం. తప్పుడు కేసులతో ఎవరినీ బెదిరించలేరు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈ సీఎం పని అయిపోయింది
సీఎం జగన్‌కు భయం పట్టుకుంది. హద్దులు దాటినవాళ్లకు తగిన బుద్ధి చెబుతాం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై దాడిచేస్తే.. భూస్థాపితం చేస్తామన్నారు. నా నియోజకవర్గ ప్రజలను నేను కలవకూడదా? పోలీసులూ.. మావాళ్లపై దాడి చేసి మావాళ్లపైనే హత్య కేసులు పెడతారా? శాంతిభద్రతలు కాపాడటమే పోలీసుల పని.. ప్రజలను కొట్టడం కాదు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని యువత కోరుకుంటున్నారు. బాబాయ్‌ను గొడ్డలిపోటుతో లేపేసి గుండెపోటు అన్నారు. నేను వంట గ్యాస్ ఇస్తే.. జగన్ రెడ్డి ఆ దీపాన్ని ఆర్పేశారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పేదల రక్తాన్ని తాగే జలగ ఈ జగన్మోహన్ రెడ్డి. చిత్తూరులో గ్రానైట్ కంపెనీలకు రూ.150 కోట్ల ఫైన్ వేశారు. రూ.150 కోట్లు కడతారా.. లేక రూ.60 కోట్ల ఫండ్ ఇస్తారా అని బెదిరించారు. ఈ సీఎం పని అయిపోయింది. అందరి పేర్లూ గుర్తు పెట్టుకుంటా. పోలీసులు ముఖం చాటేసే పరిస్థితికి వస్తున్నారు. నా ప్రచార రథానికి లైసెన్స్ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండడానికి వీలు లేదంట. తప్పు చేసిన వాళ్లనందరినీ బట్టలు విప్పి నడిరోడ్డుపై తిప్పే రోజు వస్తుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.