సొంతూర్లకు ఓటర్లు.. ఆర్టీసీఎండీకి చంద్రబాబు లేఖ

by srinivas |   ( Updated:2024-05-11 08:56:27.0  )
సొంతూర్లకు ఓటర్లు.. ఆర్టీసీఎండీకి చంద్రబాబు లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ ఎన్నికలు సిద్ధమయ్యాయి. అటు ఓటర్లు సైతం పోలింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఓటర్లు సొంతూర్లకు పయనమవుతున్నాయి. అయితే బస్టాండ్ల, బస్సులు హౌస్ ఫుల్ అయిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్ సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో సీట్ల రిజర్వేషన్ల విషయంలో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు.

ఈ దృష్టికి రావడంతో ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఆర్టీసీ బస్సులు పెంచడం వల్ల భారీగా ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పారు. ఓటు వేసేందుకు తెలంగాణ నుంచి ఏపీ ఓటర్లు భారీగా వచ్చే అవకాశం ఉందని, ఈ సమయంలో ఆర్టీసీ ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, బస్టాండులో రద్దీ కనిపిస్తోందని, అవసరమైనన్ని బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండ్లలో గంటల తరబడి ఎదురుచూస్తున్నారని, మూడు రోజులు పాటు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని లేఖలో చంద్రబాబు కోరారు.

Advertisement

Next Story

Most Viewed