తిరుపతిలో బీజేపీ నేత మాధవి లత.. మాజీ సీఎం జగన్‌కు సూటి ప్రశ్నలు

by Mahesh |
తిరుపతిలో బీజేపీ నేత మాధవి లత.. మాజీ సీఎం జగన్‌కు సూటి ప్రశ్నలు
X

దిశ, వెబ్‌డెస్క్: విరంచి హాస్పిటల్ అధినేత, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత గురువారం తిరుపతి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గానే కాలినడకన మెట్లపై నుంచి బయలు దేరిన ఆమెను మీడియా ప్రతినిధులు కలిసి.. జగన్ తిరుపతి పర్యటనపై స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాజీ సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. సెప్టెంబర్‌ 28న తిరుమల ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో బీజేపీ నాయకురాలు మాధవి లత మాట్లాడుతూ.. 18 సార్లు లడ్డూ తయారీలో తప్పు జరిగినా ఈ విషయాన్ని ఎందుకు ప్రజల దృష్టికి తీసుకురాలేదని. దేవాలయానికి లడ్డూల కోసం వచ్చిన రూ.1300 కోట్లతో తిరుమల ఆలయానికి స్వచ్ఛమైన నెయ్యి అందించే 'గౌశాల'ని ఎందుకు నిర్మించలేదని, ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉన్నప్పుడు జగన్ చేసిన తప్పులు, కుట్రలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ఆమె మీడియాతో చెప్పుకొచ్చారు.

కాగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో తిరుమల లడ్డూ వ్యవహార హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కల్తీ నెయ్యి ని ఉపయోగించి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వైసీపీ ప్రభుత్వంపై కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ కూడా ఈ నెల 28న తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనున్నారు. ఇందుకోసం 27 సాయంత్రం ఆయన తిరుమలకు చేరుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed