తిరుమల లడ్డూ తయారీ పై తీవ్రతరమవుతున్న వివాదం.. స్పందించిన బండి సంజయ్

by Jakkula Mamatha |
తిరుమల లడ్డూ తయారీ పై తీవ్రతరమవుతున్న వివాదం.. స్పందించిన బండి సంజయ్
X

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో ప్రజెంట్ తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం పై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు(CM Chandrababu) తిరుపతి లడ్డూ ప్రసాదం పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం(YCP Government) తిరుమల ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించిందని దేవుని ప్రసాదంలో అక్రమాలు జరిగాయాని సీఎం చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం(Central Govt) ద్వారా గుర్తింపు పొందిన ఓ ల్యాబ్ నివేదికలో సంచలన రహస్యాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు(Animal Fat) ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఈ ఘటన పై తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల దేవస్థానం లడ్డూ తయారీలో చేప నూనె, బీఫ్ లాటో, పామాయిల్, పంది కొవ్వు నూనెను ఉపయోగించడం పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించే హిందువులకు లడ్డూలో జంతు కొవ్వును ఉపయోగించడం అనేది విశ్వాసం మరియు నమ్మకానికి తీవ్ర ద్రోహం అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇతర వర్గాలు & నాస్తికులను ఉద్యోగులుగా మరియు TTD బోర్డులోకి అనుమతించడం వల్ల హిందువుల విశ్వాసాల పట్ల అవినీతి మరియు అగౌరవం ఏర్పడుతుందని గతంలో మేము ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని.. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed