ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్.. తిరుపతిలో అంబరాన్నంటిన సంబురాలు

by srinivas |   ( Updated:2024-06-14 12:51:44.0  )
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్.. తిరుపతిలో అంబరాన్నంటిన సంబురాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు 24 మంది మంత్రులు పదవులను స్వీకరించారు. అయితే తాజాగా వారికి శాఖలు ఖరారు చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌‌ ఖరారు అయ్యారు. దీంతో తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అంటేనే బ్రాండ్ అని చెప్పారు. ఏపీకి ఏకైక డిప్యూటీ సిఎంగా అయ్యారని తెలిపారు.ఎమ్మెల్యే కానివ్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన వారు ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారోనని కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు.

కాగా ఇటీవల జరిగిన సార్వత్రిల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి ఘన విజయం చేశాయి. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాదించింది. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, ఐటీ మంత్రిగా నారా లోకేశ్‌తో పాటు పలువురు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు దక్కాయి. దీంతో జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని గెలుచామని, చంద్రబాబు కేబినెట్‌లో మిత్రపక్షమైన తమకు సముచిత ప్రాధాన్యం తగ్గిందని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story