AP Assembly : ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

by Rajesh |
AP Assembly : ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఈ అసెంబ్లీ సెషన్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పూర్తి స్థాయి బడ్జెట్‌ను అక్టోబర్‌లో ప్రవేశ పెట్టే యోచనలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు శ్వేతపత్రాలపై కూడా చర్చించనున్నారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed