తెరపైకి మరో పొలిటికల్ మూవీ..పోస్టర్‌లో బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌

by Seetharam |
తెరపైకి మరో పొలిటికల్ మూవీ..పోస్టర్‌లో బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన సైతం బహిర్గతం అవ్వడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికలకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో సైతం ఈసీ ఎన్నిలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో పొలిటికల్ ఇతివృత్తంగా సినిమాలు తెరకెక్కితున్నాయి. వైసీపీకి ఫేవర్‌గా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వ్యూహం సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తరువాత సెకండ్ పార్ట్‌గా శపథం మూవీని కూడా రిలీజ్ చేస్తానని ఎప్పుడో ప్రకటించారు. ఆ ప్రయత్నాల్లో ఆర్‌జీవీ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే అనూహ్యంగా ‘సైకిల్’ పేరుతో ఓ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టర్‌లో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు ఈ పోస్టర్‌లో ఇది పసుపు చరిత్ర అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. అయితే ఈ దీంతో, దీనిని టీడీపీ కి ఫేవర్ గా ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 1983 నుంచి వచ్చే ఎన్నికల వరకు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తంది. శివాజీ క్రియేషన్స్‌లో జి.శివప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసమే ఈ సినిమా తెరపైకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story