కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘా

by srinivas |   ( Updated:2023-09-13 16:30:13.0  )
కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘా
X

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న కంబదూరు కుందుర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం, మండలాలపై ప్రత్యేక నిఘా ఉంచుమని విజయవాడ డిప్యూటీ కమిషనర్ నాగమందయ్య తెలిపారు. కర్ణాటక సరిహద్దు మండలమైన కంబదూరు మండల సేబ్ పోలీస్ స్టేషన్ ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి కూత వేటు దూరంలో కంబదూరు ప్రాంతం ఉండటంతో అక్రమ కర్ణాటక మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసే దిశగా నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించామన్నారు అనంతపురం జిల్లా నుంచి ఇసుక అక్రమ మార్గంలో తరలిపోకుండ చర్యలు చేపట్టామని, సరిహద్దుల్లో అవలంభించవలసిన నియమ నిబంధనలు అమలు చేయాలని ఆయన సెబ్ పోలీసులను కోరారు. ఈ సందర్భంగా ఆయన కంబదూరు సబ్ పోలీస్ స్టేషన్‌లో రికార్డులను తనిఖీ చేసి నమోదైన కేసులపై అడిగి తెలుసుకున్నారు.


Advertisement

Next Story

Most Viewed