Breaking: విశాఖలో దారుణం.. రెచ్చిపోయిన ప్రేమోన్మాది

by srinivas |   ( Updated:2024-07-17 10:42:57.0  )
Breaking: విశాఖలో దారుణం.. రెచ్చిపోయిన ప్రేమోన్మాది
X

దిశ,వెబ్ డెస్క్: విశాఖలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బాలికపై కత్తితో దాడికి యత్నించాడు. దీంతో బాలిక తల్లి అడ్డుకోబోయారు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. దాడి సమయంలో తల్లి పెద్దగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయారు. నిందితుడు సిద్ధు కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని గతంలోనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో సిద్ధును అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఈ మధ్యనే బెయిల్‌పై విడుదలైన సిద్దు మళ్లీ బాలికకు వేధింపులు ప్రారంభించాడు. తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. మళ్లీ నిరాకరించడంతో బాలికపై దాడికి యత్నించారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పెదగంట్యాడ మండలం గొంతివానిపాలెంలో ఒక్కసారిగా కలకలం రేగింది. నిందితుడిని త్వరగా పట్టుకుని జైలుకు పంపించాలని స్థానికు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed