- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: చంద్రబాబుకు మరోసారి నిరాశ.. క్వాష్ పిటిషన్ వాయిదా వేసిన సుప్రీం కోర్టు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురయ్యింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, స్కిల్ డెలప్మెంట్ కేసులో తన అరెస్ట్, రిమాండ్‌ను కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. చంద్రబాబు తరుఫున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు.
చంద్రబాబు అరెస్ట్‌లో 17ఏ సెక్షన్ వర్తిస్తుందని.. 40 రోజులుగా ఆయన జైల్లో ఉన్నారని.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హరీష్ సాల్వే కోరారు. సీఐడీ తరుఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదించారు. చంద్రబాబు అరెస్ట్‌కు సెక్షన్ 17ఏ వర్తించదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌లో రాజకీయ కక్ష లేదని.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డానని పక్కా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Read More..