- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వాళ్లు పొలిటికల్ కమెడియన్స్’..వైసీపీ నేతలపై ఆది సెన్సేషనల్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా సభలు, రోడ్‌షో లతో బిజీబిజీగా ఉన్నారు. గెలుపే లక్ష్యంగా పోటీపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తమ కుటుంబ సభ్యులు సైతం గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జనసేనాని తరఫున సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జబర్దస్త్ నటుడు హైపర్ ఆది జనసేనాని కోసం ప్రచారం చేశారు.
ఇక తాజాగా హైపర్ ఆది వైసీపీ పాలన పై నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలోకి వస్తే మద్యం నిషేధం చేస్తామని చెప్పారు చేశారా? అని ప్రశ్నించాడు. పెన్షన్ 3 వేలు ఇస్తామన్నారు ఇచ్చారా? అని అన్నారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ఎవరు? కామెడి చేసింది ఎవరు అన్నారు. కాబట్టి కామెడీ అంతా వారు చేసి మమ్మల్ని అంటే ఎలా అని ఎద్దేవా చేశారు. మేమంతా జస్ట్ ప్రొఫిషనల్ కమెడియన్స్ వారి లాగా పొలిటికల్ కమెడియన్స్ కాదు అని చెప్పారు. నేను బీటెక్ చదువుకున్నాను నాకు అన్ని విషయాల పై అవగాహన ఉంటే తప్ప నేను ఏం మాట్లాడను అని అన్నారు. ఇక ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై హైపర్ ఆది మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన మార్చుకుంటా అని ముద్రగడ పద్మనాభం అన్నారని గుర్తుచేశారు. ముద్రగడ పేరు మార్చుకోవడం పక్కా అని, ఎంత మంది ముద్రగడలు వచ్చినా పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనసేన గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి పవన్ కళ్యాణ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read More...
పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్