ప్రభుత్వ పథకాలకే కాదు.. తిరుమల లడ్డూకు ఆధార్‌తో లింక్ పెట్టిన టీటీడీ

by Mahesh |   ( Updated:2024-08-29 09:26:06.0  )
ప్రభుత్వ పథకాలకే కాదు.. తిరుమల లడ్డూకు ఆధార్‌తో లింక్ పెట్టిన టీటీడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత భారత దేశంలో ఏ పని చేసిన ఆధార్ కార్డు లేకుండా ముందుకు సాగదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు ఈ ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో ప్రతి పౌరుడికి ప్రథమ గుర్తింపుగా ఈ ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ పథకాలే కాకుండా తిరుమల తిరుపతిలో కూడా ఆధార్ కార్డుకు లడ్డుకు టీటీడీ అధికారులు లింక్ పెట్టారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డు కావాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు. భక్తుడికి ఒక లడ్డు తో పాటు ఆధార్ కార్డు ఉన్న భక్తుడికి అదనంగా మరో లడ్డు ఇస్తున్నారు. మొత్తం దర్శనం టికెట్ పై ఒక లడ్డూ, ఆధార్ కార్డు పై మరో లడ్డూలను టీటీడీ అధికారులు అందిస్తున్నారు. ఈ నిర్ణయంతో భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed