Nanadyal: నల్లమలలో 154 ఏళ్ల తర్వాత కనిపించిన అడవి దున్న

by srinivas |   ( Updated:2024-07-03 14:37:11.0  )
Nanadyal: నల్లమలలో 154 ఏళ్ల తర్వాత కనిపించిన అడవి దున్న
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా నల్లమలలో అరుదైన అడవి దున్న కనిపించింది. అయితే ఈ దున్న జాతి 150 క్రితం అంతరించిపోయినట్లు అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షం కావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధి బైర్లూటీ రేంజ్‌ అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా అడవి దున్నను ఫారెస్ట్ సిబ్బంది వీడియో తీశారు. 1870 తర్వాత నల్లమలలో మళ్లీ జాతి దున్న కనిపించదని, కర్నాటక నుంచి కృష్ణా నదిని దాటి వచ్చి ఉంటుందని ఫారెస్ట్ సిబ్బంది భావిస్తున్నారు. అయితే ఈ జాతి జంతువును జనవరిలోనే తొలిసారిగా వెలుగోడు రేంజ్‌లో చూశామని, ఇప్పుడు ఆత్మకూరు డివిజన్ పరిధిలో గుర్తించామని చెప్పారు. ఈ దున్నలు ఇండియన్ బైనస్‌గా ప్రసిద్ధి చెందినవని, ఒకప్పుడు నల్లమలలో సంచరించేవని, ఆ తర్వాత క్రమేపీ కనుమరుగయ్యాయని తెలిపారు. కర్ణాటక పశ్చిమ కనుమల్లో కనిపించే ఈ అడవి దున్న కిలో మీటర్ల మేర దాటి నల్లమలలోకి ప్రవేశించడం అద్భుతమని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed