- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YSRCP:వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడనున్న కీలక నేత?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ(YCP) 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు వైసీపీని వీడి అధికార టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా.. కాకినాడ జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఓటమి తర్వాత ఆయన పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని టాక్. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కన్నబాబుకు వైఎస్ జగన్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన మాత్రం పెద్దగా క్రియాశీలంగా కనిపించలేదని సమాచారం. ఈ క్రమంలో వైసీపీకి భవిష్యత్తు లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని, టీడీపీ, జనసేన పార్టీల్లో చేరే అవకాశం లేకపోవడంతో.. జాతీయ పార్టీ బీజేపీ(BJP)లో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.