ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత

by karthikeya |   ( Updated:2024-09-08 15:36:10.0  )
ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్‌డెస్క్: గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాలతో కృష్ణ (Krishna River), గోదావరి (Godavari River) నదులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపు నీరంతా చేరడంతో రెండు నదులూ నిండు కుండల్లా మారాయి. ఈ క్రమంలోనే ధవళేశ్వరం బ్యారేజీ (Dhawaleswaram Barage)లోని 175 గేట్లను ఎత్తినట్లు మిగులు నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 8 అడుగులు ఉందని, అన్ని గేట్లను ఎత్తి 4.98 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశామని అధికారులు చెప్పారు.

ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితమే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 11 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గోదావరి నదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమేపి పెరుగుతుండడంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి మరింత వరద నీరు చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు (Irrigation Officials) అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed