- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.5లక్షల నోట్లకు చెదలు: చెదల పుట్టకి.. పేదోడి డబ్బే దొరికిందా
దిశ,వెబ్‌డెస్క్: సొంతిల్లు ప్రతీ ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు తిండి తినకుండా రేయింబవళ్లు కష్ట పడుతుంటారు. వచ్చిన ప్రతీ పైసాను కూడబెట్టి తమ కలల సౌధాన్ని తీర్చిదిద్దుకుంటుంటారు. అలా ఓ వ్యక్తి రూ. 10లక్షలతో ఇల్లు నిర్మించాలని అనుకున్నాడు. అందులో రూ.5లక్షలు పోగు చేసుకున్నాడు. పోగు చేసుకున్న ఆ రూ.5లక్షలకు చెదలు పట్టడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు.
కృష్ణాజిల్లా మైలవరం గ్రామానికి చెందిన వాటర్ ట్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్నాడు బిజిలీ జమలయ్య. జమలయ్య స్థానికంగా పందుల వ్యాపారం చేస్తుంటాడు. వచ్చిన కొద్ది మొత్తాన్ని తన చిరకాల కోరిక సొంతిల్లు నిర్మించుకునేందుకు కూడబెట్టుకుంటున్నాడు.
అయితే జమలయ్యకి బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టలో పోగు చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకూ రూ.5లక్షల వరకు ఆ పెట్టెలోనే దాచాడు. ఈ నేపథ్యంలో జమలయ్యకు అత్యవసరంగా రూ.లక్ష కావాల్సి వచ్చింది. ఆ లక్ష రూపాయాలు తీసుకుందామని ట్రంక్ పెట్టె ఓపెన్ చేశాడు. అంతే ట్రంక్ పెట్టెలో ఉన్న రూ.5లక్షల్ని మాయదారి చెదలు కొరుక్కుతిన్నాయి. దీంతో ఏం చేయాలో పాలు పోక బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే చెదలు పట్టిన నోట్లని ఆర్బీఐ తీసుకుంటుందా…? బ్యాంక్ లో మార్చుకోవచ్చా’ లేదో బాధితులకు పోలీసులకు చెప్పాలని స్థానికులు కోరుతున్నారు.