రోజాకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు

by srinivas |

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్ రోజాకు రాజధాని నిరసనల సెగ తగిలింది. అమరావతి రీజియన్‌లోని ఐనవోలులోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ‘పరిశ్రమ-విద్య’ అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు రోజా యూనివర్సిటీకి చేరుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న అమరావతి ప్రాంత మహిళా రైతులు యూనివర్సిటీకి తరలివచ్చారు. గేటు వద్ద గుమికూడి రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు’.. ‘భూములిచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులు కాదం’టూ నినాదాలతో యూనివర్సిటీ ప్రాంగణాన్ని హోరెత్తించారు.

కాగా, అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగనీయాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 65వ రోజుకు చేరుకున్నాయి. మందడం దీక్షా శిబిరంలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. కృష్ణాయపాలెంలో ఇళ్ల స్థలాల కోసం సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. వారి విధులకు ఆటంకం కలిగించినందుకు 426 మంది రైతులపై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story