కార్పొరేట్ పరం చేసేందుకే.. ఆ బిల్లులు

by Aamani |   ( Updated:2022-08-29 15:32:33.0  )
కార్పొరేట్ పరం చేసేందుకే.. ఆ బిల్లులు
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: రైతు వ్యతిరేక బిల్లు‌లను పార్లమెంటులో ప్రవేశ పెట్ట వద్దన్న పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నంది రామయ్య మాట్లాడుతూ…. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌లకు అప్పజెప్పడానికే పార్లమెంట్‌లో నిత్యావసరాల చట్టం,వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం,కార్పొరేట్ వ్యవసాయ బిల్లులను కేంద్రం ప్రవేశపెడుతోందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లులు దేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ఆత్మహత్యలను పెంచేవిగా ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే ఈ బిల్లులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. స్వదేశీ పేరుతో విదేశాలకు దేశాన్ని మోడీ అమ్ముతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జె.రాజు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నూతన్ పాల్గొన్నారు.

Read Also…

సర్కారు మాట తప్పిందని… మాజీ మావోయిస్టుల ధర్నా

Advertisement

Next Story

Most Viewed