Custard Apple: ఒక్కసారి ఈ పంట వేస్తే చాలు.. ఏడాదికి రూ. 6 లక్షల ఆదాయం

by Prasanna |
Custard Apple: ఒక్కసారి ఈ పంట వేస్తే చాలు.. ఏడాదికి రూ. 6 లక్షల ఆదాయం
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు వర్షాలు ఎక్కువ పడిన సమస్యే.. అసలు పడకపోయిన కూడా సమస్యే.. ప్రతీ సీజన్‌లో చాలా మంది రైతులు రక రకాల పంటలు పండిస్తుంటారు. వాటిలో ఎక్కువ ఆదాయం వచ్చేవి ఎంచుకుంటారు. తెలియని పంటలు వేసి నష్టపోయే కన్నా ఒకేసారి అధిక దిగుబడి వచ్చే దాన్ని సాగు చేయాలనుకుంటారు.

ఈ మధ్య కాలంలో సీతాఫల పంటను అనేక రైతులు సాగు చేస్తూ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. ఎందుకంటే, ఈ మొక్కను ఒక్కసారి నాటితే కొన్నేళ్ల పాటు పండించవచ్చు. సీతాఫలం ( Custard Apple ) సాగు ద్వారా రైతులు అధిక మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు.

వ్యవసాయంలో సంప్రదాయ పంటలను వేసే కొందరు రైతులు వారి ఆలోచనకు పెద్దపీట వేస్తూ ఏయే పంటలను సాగు చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందో వాటి గురించి తెలుసుకుని, చివరికి సీతాఫలం సాగు గురించి తెలుసుకుని మొదలు పెట్టారు. ఎకరంన్నర పొలంలో సీతాఫలం వేశారు. సరయిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పంటను మార్కెట్ కు తరలిస్తున్నారు. సంవత్సరానికి రూ. 5 నుంచి 6 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో కూడా ఈ పళ్ళకు డిమాండ్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed