- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, న్యూస్‌బ్యూరో: పంటల సాగుపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహిస్తారని తెలంగాణ వ్యవసాయ మంత్రి ఎస్. నిరంజ్ రెడ్డి తెలిపారు. వానాకాలం కంది, పత్తిపంటలు ఎక్కువగా సాగు చేయాలని, మొక్కజొన్న సాగు వద్దని రాష్ట్ర రైతాంగాన్ని కోరారు. తెలంగాణ రైతు ఉన్నతస్థాయిలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. మంగళవారం హాకాభవన్‌లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో సమగ్ర వ్యవసాయ విధానం మీద మంత్రి సమీక్ష నిర్వహించారు. నూతన వ్యవసాయ విధానం మీద తాను బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో తిరిగి సమీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశానికి రైతు బంధు సమితి రాష్ట్ర, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ నిపుణులు హాజరవుతారని తెలిపారు. ఈ వానాకాలంలో తెలంగాణలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అన్నారు. ఏ జిల్లాల్లో ఏ పంట సాగుచేయాలనేదానిపై అధికారులు పంటల మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారని అన్నారు. 10లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర రావాలని, రైతులు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని మంత్రి ఆకాంక్షించారు.