వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తాం..

by Shyam |   ( Updated:2020-03-12 08:33:14.0  )
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తాం..
X

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతాంగాన్ని సాగువైపు ప్రోత్సహిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్న విషయం నిజమేనా? అని శాసన సభ్యులు బాల్కసుమన్, ఆల వెంటేశ్వర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, భాస్కర్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ ప్రాంతం అనుకూలమని కేంద్ర కమిటీ నిర్ధారించిన విషయాన్ని సభ్యులందరికి తెలియజేశారు. మొత్తంగా 2.78 లక్షల హెక్టార్లు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించారు.ఇతర పంటలతో పాటు ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా పంట తరలింపునకు అయ్యే రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పలు జిల్లాల్లో రైతులకు ఇప్పటికే అవగాహనా సదస్సులతో పాటు క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా పూర్తి చేశామన్నారు. దేశంలోని 130 కోట్ల జనాభా ఏడాదికి 21 మిలియన్ టన్నుల నూనెలు వినియోగిస్తున్నారని, అందరికి అందుబాటులో ఉండేందుకు రూ.75 వేల కోట్ల విలువైన నూనెలను మనం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదని తెలిపారు. పంట ఎంత పెరిగితే విదేశాల నుంచి దిగుమతి అంత తగ్గిపోతుందన్నారు. ఆయిల్ ఫామ్ రీసెర్చ్ స్టేషన్ కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను సంప్రదిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సభ్యులకు సమాధానమిచ్చారు.

Tags: Agriculture, assembly, minister, mlas, niranjanreddy, venkataveeraiah,

Advertisement

Next Story

Most Viewed